ఉపాధ్యాయుల నిర్లక్ష్యం..  

26 Jun, 2018 13:52 IST|Sakshi
విద్యార్థిని రాసిన 073 జవాబు పత్రం 

తారుమారైన విద్యార్థిని జీవితం

నూతనకల్‌(తుంగతుర్తి) : విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని జీవితం తారుమారైంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల కేంద్రానికి చెందిన వీరబోయిన సంధ్య గత సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో హాల్‌టికెట్‌ నంబర్‌ 1830113676 హాజరైంది. మే నెలలో విడుదలైన ఫలితాల్లో సంధ్య సైన్స్‌ తప్పా అన్ని సబ్జెక్టుల్లో పాసైంది.

అనుమానం వచ్చిన సంధ్య వెయ్యి రూపాయల చలానా తీసి బోర్డు ఆఫ్‌ సెకండరికీ దరఖాస్తు చేసుకుంది. సెకండరీ బోర్డు అధికారులు విద్యార్థిని రాసిన పరీక్ష జవాబు పత్రాల జీరాక్స్‌లను పోస్టు ద్వారా ఆమె ఇంటికి పంపించారు. ఆమె రాసిన సైన్స్‌ పేపర్‌–1 ఫిజిక్స్‌లో 06 మార్కులు రాగా పేపర్‌–2 జీవశాస్త్రం 14 మార్కులు వచ్చాయి.

ఆమె రాసిన సైన్స్‌ జవాబు పత్రం నంబర్‌ 073 కాగా ఫిజిక్స్‌ పేపర్‌కు సంబంధించి 073కి బదులు 078 జవాబు పత్రాన్ని పంపడంతో దానిని రాసిన సంధ్య ఆమె రాసిన రాతకు పంపిన జీరాక్స్‌ జవాబు పత్రంలోని రాతకు తేడా కనిపించడంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం దామెర శ్రీనివాస్‌ను కలువగా పేపరు దిద్దిన దగ్గరనే తప్పు జరిగిందని 073 సీరియల్‌ నంబరు గల జవాబు పత్రాన్ని సంధ్యకు ఇవ్వాల్సి ఉండగా దానికి బదులు 078 జవాబు పత్రాన్ని జత చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి న్యాయం చేయాలని విద్యార్థిని కోరుతుంది. ఉపాధ్యాయుల చిన్న ఆ శ్రద్ధతో విద్యార్థిని ఒక సంవత్సరం విద్యాభ్యాసాన్ని కోల్పోయినట్లయ్యింది.

మరిన్ని వార్తలు