మరో ఇద్దరి బాలికలకు విముక్తి ?   

11 Aug, 2018 14:21 IST|Sakshi
నిందితులను ప్రభుత్వ ఆస్పత్రి నుంచి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

ఒకరు ప్రజ్వల హోంకి, మరొకరు నల్లగొండకు తరలింపు

యాదగిరిగుట్టలో ముమ్మరంగా కొనసాగుతున్న  ఆపరేషన్‌ ముస్కాన్‌

ఇప్పటికే 15మందిని రక్షించిన పోలీసులు

యాదగిరిగుట్ట(ఆలేరు) : యాదగిరిగుట్ట పట్ట ణంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. చిన్నారుల అక్రమ రవాణా ముఠాతో పాటు ఇటీవల ఇళ్లు వదిలివెళ్లిన వ్యభిచార ని ర్వాహకులను పట్టుకునేందుకు పోలీస్‌శాఖ మూ డు టీంలుగా విడిపోయి గాలిస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం యాదగిరిగుట్టలోని గణేష్‌నగర్‌లో పోలీసులు చేసిన దాడుల్లో 10మంది వ్యభిచార నిర్వాహకులతో పాటు ఇద్దరు బాలికలు దొరికినట్లు సమాచారం. వీరిని విచారించిన పోలీసులు వారి వద్ద ఉన్న ఇద్దరి చిన్నారులను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారని తెలిసింది.

ఇప్పటికే 15 మందికి విముక్తి..

గత నెల 30వ తేదీ నుంచి యాదగిరిగుట్ట పట్ట ణంలో కొనసాగుతున్న ఆపరేషన్‌ ముస్కాన్‌లో వ్యభిచార నిర్వాహకుల ముఠా సభ్యుల నుంచి ఇప్పటికే 15మంది చిన్నారులకు పోలీసులు వి ముక్తి కల్పించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరి బాలికలను గుర్తించి నిర్వాహకుల నుంచి విముక్తి కల్పించి, భువనగిరిలో స్త్రీ, శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. దీంతో వారిలో ఒకరిని ఆమనగల్‌లోని ప్రజ్వల హోంకి, మరొకరిని నల్లగొండకు తరలించినట్లు ఐసీడీఎస్‌ అధి కారులు తెలిపారు. చిన్నారులు ఎక్కడ దొరి కా రు. ఎప్పుడు దొరికారు అనే విషయాలపై అటు పోలీసులు, ఇటు ఐసీడీఎస్‌ అధికారులు నోరు విప్పడం లేదు. 

మూడు టీంలుగా గాలింపు

బాలికలను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న గ్యాంగ్‌ సభ్యుల  తాట తీయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో పోలీస్‌ శాఖ మూడు టీం లుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్‌నగర్‌తో పా టు ఇతర ప్రాంతాలను జల్లెడపడుతున్న పోలీ సులు.. ఇటీవల ఇళ్లను వదిలి వివిధ ప్రాంతాల కు వెళ్లిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మొ న్నటి వరకు యాదగిరిగుట్టలో వ్యభిచారం నిర్వహించిన వారి బంధువులు ఎక్కడ ఉన్నారు.. వా రు ఇప్పుడు ఏ వృత్తిలో కొనసాగుతున్నారు.. అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్దిపేట, జగిత్యాల ప్రాంతాల్లో అక్కడి పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేసినట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాలే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వ్యభిచార గృహ నిర్వాహకుల చెరల్లో ఉన్న బాలికలను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పోలీసులు అడుగు ముందుకు వేసి దర్యాప్తు ముమ్మరం చేశారనిపిస్తుంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కొంతమంది వ్యభిచార నిర్వాహకులను శుక్రవారం రాత్రి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.

పోలీస్‌ కస్టడీకి నిందితులు

భువనగిరి క్రైం : యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా పోలీసులకు పట్టుబడిన చిన్నారులు, వ్యభిచార నిర్వహకులను శుక్రవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయస్థానం వీరిని జ్యూడీషి యల్‌ కస్టడీ నుంచి మూడు రోజుల విచారణ నిమిత్తం పోలీస్‌కస్టడీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.   

>
మరిన్ని వార్తలు