మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ

21 May, 2015 03:09 IST|Sakshi
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ

నేడు నామినేషన్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా బరిలో దిగనున్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తుమ్మలను పోటీ చేయించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణరుుంచింది. నామినేషన్ వేసేందుకు గురువారం చివరిరోజు కావడంతో ఆయనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి పేర్లు ప్రకటించారు. శాసన సభ, శాసన మండలిలో సభ్యులు కాకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఆర్నెళ్లలోపు ఉభయ సభల్లో ఒక దానికి ఎన్నిక అయితేనే మంత్రి పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.

లేదంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమ పదవికి రాజీ నామా చేయాలి. గత ఏడాది డిసెంబర్ 16న తుమ్మల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. మే 15తో ఆయన మంత్రిగా కొనసాగబట్టి ఐదు నెలలైంది. ఇప్పట్లో ఈ ఎన్నికలు మాత్రమే ఉండటంతో తప్పని సరి పరిస్థితుల్లో మండలికి ఎన్నిక కావాలి. అందుకే సీఎం.. మంత్రి తుమ్మలకు శాసన మండలి టిక్కెట్ ఖరారు చేశారు. మండలిలో ఖాళీ అయిన స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయమై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఎమ్మెల్యేల నిర్ణయంతో తొలుత బుధవారం రాత్రి తుమ్మల, కడియం పేర్లు ఖరారు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు తుమ్మల నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హైదరాబాద్ తరలివెళ్లారు.

మరిన్ని వార్తలు