బీఆర్‌ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో చేరిక

15 Oct, 2023 15:16 IST|Sakshi

ఖమ్మం: మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్‌కి రాజీనామా చేశారు.  కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పోంగులేటి శ్రీ నివాసరెడ్డితో చర్చలు సఫలం అయ్యాయి. బాలసానిని కాంగ్రెస్ లోకి స్వాగతం పలుకుతున్నామని పోంగులేటి శ్రీ నివాసరెడ్డి తెలిపారు. 

గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేశారని పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ అపలేరని చెప్పారు. టిఎస్పిఎస్సీ నోటిఫికేషన్‌లు హడావుడిగా ఇచ్చి పేపర్ లు లీక్  చేసి నిరుద్యోగ యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. 

బాలసాని తనతోనే ప్రయాణం చేశారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కళ్ల ముందే ఒక చరిత్ర కనిపిస్తోందని చెప్పారు. 40సంవత్సరాలుగా జిల్లా ప్రజలు చూస్తున్నారు..తమ ఆలోచన ప్రజా దృక్పథమే అని అన్నారు. రాజకీయ యుద్ధంలో ఏది న్యాయం .. ఏది ధర్మమో ప్రజలే ఆలోచన చేయాలని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చే పరిపాలన కోసం కాంగ్రెస్ లోకి వచ్చామని చెప్పారు.

ఖమ్మం అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల చేరికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. కార్పొరేటర్లు కమర్తపుమురళి ,చావనారాయణలను పొంగులేటి ,తుమ్మల కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మరో నలుగురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లోకి  ఆహ్వానించనున్నట్లు సమాచారం. టార్గెట్ అజయ్ కుమార్ గా పనిచేస్తున్నార విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. కేసీఆర్‌ హామీలివే..

మరిన్ని వార్తలు