పోలీస్ వాట్సప్

6 Dec, 2015 02:38 IST|Sakshi
పోలీస్ వాట్సప్

ప్రమాద వివరాలు, సాయం కోసం అందుబాటులోకి..
 94910 89257 నంబర్
 ప్రకటించిన సీపీ సుధీర్‌బాబు
 వరంగల్ క్రైం :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఉంటున్న ఆండ్రారుుడ్ సెల్‌ఫోన్లలోని వాట్సప్ అప్లికేషన్ సాయం తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రజలు తమకు ఎదురైన ఆపద వివరాలు అందజేయడంతో పాటు సాయం కోసం విజ్ఞప్తి చేసే అవకాశముంది. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు.
 
 ప్రత్యేక విభాగం ఏర్పాటు
 ప్రజల నుంచి ఫిర్యాదులు, సాయం కోసం విజ్ఞప్తులను తక్షణమే అందుకునేలా వాట్సప్ నంబర్ ఏర్పాటుచేసిన ట్లు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ నంబర్ ద్వారా కమిషనరేట్ పరిధి లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లోనే సమాచారం అందించవచ్చన్నా రు. శాంతిభద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలపై ప్రజలు  94910 89257 వాట్సప్ నం బర్‌కు చిత్రాలు, వీడియోలు పంపించి పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ నంబర్ ద్వారా ప్రజలు ఆపదసమయంలో కూడా సాయం కోరవచ్చని తెలిపారు. కాగా, ఈ నంబర్‌కు సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యం గా ఉంచనున్నట్లు ఆయన వెల్లడించా రు.
 
  అంతేకాకుండా ఈ నంబర్‌కు ఇచ్చే సమాచారం ఆధారంగా స్పందించేందుకు ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేశామన్నారు. ఈ విభాగానికి అందే ఫిర్యాదులు, విజ్ఞప్తులపై స్పం దించనున్న వీరు సంబంధిత ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌తో పాటు బ్లూకోల్డ్స్ సిబ్బం దికి సమాచారం ఇచ్చి పరిష్కారమయ్యేలా చూస్తారని తెలిపారు. సమావేశంలో ఏసీపీలు జనార్దన్, శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, మహేందర్, ఈశ్వర్‌రావు, రమేష్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు