మోత.. కోత..!

18 Feb, 2015 01:41 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు కరెంట్ చార్జీల పెంపు, మరోవైపు విద్యుత్‌కోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంట్ ఎంతవాడితే అంత మేర చార్జీల భారం పెరగనుంది. దీంతో ప్రతినెలా వినియోగదారుల మీద దాదాపు రూ.15 కోట్లకు పైగా భారం పడనుంది. ఇదిలా ఉంటే వేసవికి ముందే అప్రకటిత కోతలతో విద్యుత్ సంస్థలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా అవసరాల కోసం 19మిలియన్ యూనిట్లు విద్యుత్ కావాల్సి ఉండగా... కేవ లం 14మిలియన్ యూనిట్లే సరఫరా అవుతోంది. అంతేకాదు రోజురోజుకు విద్యుత్ డి మాండ్ పెరుగుతుండడంతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ఈసారి అరకొరగా సాగుచేసిన పంటలకు సై తం కరెంట్ కోతలతో నీరందించలేక రైతులు సతమతమవుతున్నారు. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాల్లో తా గునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
 భారీ వడ్డన...
 ఇప్పటికే విద్యుత్ చార్జీలు తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో మరోసారి పిడుగు పడనుంది. పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేర కు ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించాయి. దీం తో మధ్యతరగతి ప్రజల మొదలుకొని ప్రతీ ఒక్కరిపై భారం పడనుంది.
 
  కరెంట్ వాడేకొద్దీ చార్జీల మోత మోగనుంది. వంద యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఇందులో మినహా యింపు లభించింది. వందకన్నా ఒక్క యూనిట్ పెరిగినా అదనంగా 48 పైసలు వసూలు చేయనున్నారు. దీని ప్రకారం 200 యూ నిట్లు వాడితే రూ. 645తో పాటు సర్వీస్ చార్జీలను అ దనంగా వడ్డిస్తారు. తర్వాత ఒక్క యూనిట్ పెరిగినా రూ.871.25 వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ చార్జీల కంటే రూ.226కుపైగా వినియోగదారులపై భారం పడనుంది. దీని ప్రకారం క్యాట గిరీ-1లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,31,417 గృహ సంబంధిత స ర్వీస్‌లకు 4.72శాతంతో నెలకు రూ.40లక్షల వరకు భారం పడనుంది. క్యాట గిరీ-2లో 67 వేలకుపైగా ఉ న్న కమర్షియల్ సర్వీస్‌లకు 5.72 శాతంతో రూ.38లక్షలు, 8 వేలకుపైగా ఉన్న పరిశ్రమల సర్వీస్‌లకు 5.76 శాతంతో రూ.35లక్షల వరకు పెరగగా వీధిదీపాలకు 5.6శాతంతో రూ.30 లక్షల వరకు పెరగనున్నాయి.
 
 కోతల మోత...!
 కరెంట్ చార్జీలతో పోటీ పడుతూ అప్రకటి త కోతలు కూడా పెరుగుతున్నాయి. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ప్రతిరోజు అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లా అవసరాలు తీరాలంటే మొత్తం 19.50 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రతిరోజూ కేవలం 13.50 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో డిమాండ్ సరఫరాకు భారీ వ్యత్యాసం ఉండడంతో లోటును పూడ్చుకోవడం కోసం ఎడాపె డా అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. లోడ్ రిలీఫ్ కోసం జిల్లా కేంద్రం, పట్టణాలు, మున్సిపాలిటీలలో ఆరుగంటల పాటు కోత విధించాలని సూచన ప్రా యంగా నిర్ణయించారు. వీటిని రెండు విడతలుగా అమలు చేయాలని విద్యుత్ సంస్థ నిర్ణయించింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల పాటు, గ్రామాల్లో 12గంటల పాటు విద్యుత్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక వ్యవసాయానికి అందజేస్తున్న ఆరు గంటల విద్యుత్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలోని మొత్తం ఫీడర్లను గ్రూప్-ఎ, గ్రూప్-బిలుగా విభజించి కరెంట్ సరఫరా చేస్తున్నా... ఎక్కడా నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదని విద్యుత్ అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పుడే కోతలు ఈ విధంగా ఉంటే తమ ప రిస్థితి ఏంటని వ్యాపారులు, చిన్న పరిశ్రమలు వాపోతున్నాయి. వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తిచేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు