పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత

15 Mar, 2020 08:36 IST|Sakshi

సాక్షి, మిర్యాలగూడ : ఈనెల 8న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఆత్మహత్య చేసుకున్న తిరుగనరు మారుతీరావు కుమార్తె అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు.  

తండ్రి అంత్యక్రియల వద్ద అమృతకు చేదు అనుభవం..
తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తండ్రి మృతదేహాన్ని చూడటానికి అంత్యక్రియల సమయంలో పోలీసుల భద్రత నడుమ శ్మశానవాటిక వద్దకు వచ్చిన అమృతను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అమృత గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో పాటు తోపులాట జరిగింది. దాంతో తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం అమృత బాబాయి శ్రవణ్‌ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి.  (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!)

తల్లితో పది నిమిషాలు..
తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్‌ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం నా లుగు రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ')

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా