ఇందూరుకు అధునాతన ఈవీఎంలు

4 Apr, 2019 03:45 IST|Sakshi

కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌జైన్‌ సమీక్ష

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరి లో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌ నిర్వహణకు వీలున్న అధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరు ను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థలు ఈసీఐఎల్, భెల్‌ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు చేరుకున్నారు. 600 మందికి పైగా ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. నియోజకవర్గం పరిధిలో 1,788 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్‌ కేం ద్రానికి ఒక్కో కంట్రోల్‌ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలెట్‌ యూనిట్లను అమర్చి పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది.  

ఏర్పాట్ల పర్యవేక్షణ 
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ సుదీప్‌జైన్, ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్‌ నిఖిల్‌కుమార్‌ బుధవారం నిజామాబాద్‌లో పోలింగ్‌ ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సుదీప్‌జైన్‌ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఎం–2 ఈవీఎంఎస్‌ ద్వారా, 4 బ్యాలెట్‌ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు.

నిజామాబాద్‌ స్థానానికి 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎన్నిక ఎంతో చాలెంజ్‌తో కూడుకుందని, అతి తక్కువ సమయంలో దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదని.. 12 బ్యాలెట్‌ యూనిట్స్‌తో ఎన్నిక నిర్వహించడం ఇదే తొలిసారని అన్నారు. 

‘బ్యాలెట్‌ పద్ధతిలోనేఎన్నికలు నిర్వహించాలి’
సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించాలని ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న రైతు అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగర శివారులోని విజయలక్ష్మీ ఫంక్షన్‌హాలులో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు.  

మరిన్ని వార్తలు