‘ఆసరా’ అక్రమార్కులపై కొరడా

3 Apr, 2015 00:38 IST|Sakshi

జిరాక్స్ సెంటర్‌పై పోలీసుల దాడి
ఆధార్‌కార్డుల్లో అక్రమాలు బహిర్గతం
కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం
యాజమానితోసహా 19 మందిపై క్రిమినల్ కేసులు

 
పరకాల : తీగలాగితే డొంక కదిలింది.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లలో అక్రమాలతో దండుకున్న వారు... దురాశతో ఆధార్‌కార్డుల్లో వయసు మార్చి లబ్ధిపొందాలనుకున్న వారు కటకటాలపాలయ్యూరు. ‘మొన్న పరకాల.. ఇటీవల మొగుళ్లపల్లి... అని ఉదహరిస్తూ ఆసరా పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సాక్షి’ జిల్లా మొదటిపేజీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అప్పట్లోనే విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఆసరా పింఛన్ల జాబితాను తీసుకెళ్లి క్షేత్రస్థారుులో నిశిత పరిశీలన చేశారు.

ఈ క్రమంలో పరకాలలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న దినేష్ జిరాక్స్ సెంటర్‌లో ఆధార్‌కార్డుల్లో వయసు మార్చే తతంగం సాగుతున్నట్లు గుర్తించిన ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరకాల సీఐ బి.మల్లయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఎస్సై రవీందర్ జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసి కంప్యూటర్లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆధార్ ఐడీ, యూజర్ పాస్‌వర్డ్‌ను కనుగొని తప్పుడు ఆధార్ కార్డులు(ఫేక్) సృష్టించి ఇ చ్చినట్లు తేలింది. దీంతో దినేష్ జిరాక్స్ సెంటర్ నిర్వహకుడు నూటేంకి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, క్రిమినల్ కేసు నమోదు చేశా రు.  దురాశతో అక్రమంగా పింఛన్ పొందాలనుకున్న వెల్లంపల్లికి చెందిన పెండెల సమ్మయ్య, పెండెల రాజయ్య, యాట సారయ్య, రేగూరి సమ్మిరెడ్డి, అనిశెట్టి కొంరయ్య, దేవునూరి మల్లయ్య, ఎం డీ రాజ్‌బీ, రేగూరి సాం బరెడ్డి, రేగూరి బుచ్చిరెడ్డి, మాటేటి పోశాలు, మంద అయోధ్య, ఎదుల యాదయ్య, మంద పేరయ్య, ఏకు సారయ్య, పెండెల సాంబయ్య, చిన్నరాజయ్య, రావుల ఎల్లయ్య, కడారి సాంబయ్య, బరిగేల సమ్మయ్యపైనా క్రిమినల్ కేసులు నమో దు చేసి చేసినట్లు సీఐ తెలిపారు.
 
ఇలా దొరికారు...

 మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన 19 మంది పింఛన్ కోసం ఎం పీడీఓ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నారు. వయసు లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యూరుు. సదరు వ్యక్తులు వాటిలో వయసు మార్చి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అవి మళ్లీ రావడంతో  అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా, అక్రమ తతంగం వెలుగుచూసింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా