హైకోర్టు విభజన కోసం 15 నుంచి నిరశన

13 Jul, 2014 02:25 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) నిర్ణయించింది. మంగళవారం నుంచి హైకోర్టు ఎదురుగా ప్రారంభమయ్యే ఈ నిరాహారదీక్షలో న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొనాలని టీ లాయర్ల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని న్యాయవాదులు కోర్టు ప్రాంగణాల్లోనే నిరాహార దీక్షలు చేయాలని, ఈ నెల 30లోపు విభజన ప్రక్రియను ప్రారంభించకపోతే, ఆగస్టు 1 నుంచి ఆందోళనలను తీవ్రం చేస్తామని తెలిపారు. అలాగే తెలంగాణకుప్రత్యేక బార్‌కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 14, 15 తేదీల్లో అన్నికోర్టుల్లో విధులను బహిష్కరించాలని బార్‌కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి, జావీద్, అనంతసేన్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు