‘రమ్య’ చట్టం తీసుకురావాలి

9 Jul, 2017 12:56 IST|Sakshi
‘రమ్య’ చట్టం తీసుకురావాలి

హైదరాబాద్‌: మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రమ్య చట్టం తీసుకురవాలని చిన్నారి తండ్రి వెంకటరమణ పేర్కొన్నారు. పంజాగుట్ట ఆక్సిడెంట్‌లో తీవ్ర  గాయాలపాలై రమ్య ప్రాణాలు కోల్పోయి నేటికి ఏడాది పూర్తయింది.  ఈ సందర్భంగా రమ్య కుంటుంబసభ్యులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం‍లో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ.. 2016 జూలై 1న ప్రమాదం జరిగేతే 9 రోజులపాటు మృత్యువుతో పోరాడిన రమ్య జూలై 9 న ప్రాణాలు విడిచింది. ఒకే కుంటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు  ఈ ప్రమాదం‍లో ప్రాణాలు కోల్పోయారు. తప్పతాగి మితిమీరిన వేగంతో కారు నడపడం వలనే తమ కుంటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఉండాలంటే రమ్య యాక్ట్‌ తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు