తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష

8 Mar, 2018 11:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనభ స్పీకర్ మధుసుదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు గురువారం అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

ఈ భేటీ అనంతరం రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, అసెంబ్లీ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఈ సమావేశం జరుగనుంది. ఈ నెల 12న బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసగించనున్నారు. అదే రోజు తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అసెంబ్లీ వద్ద తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై వీరు చర్చించనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు