పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే సండ్ర హల్‌చల్‌

21 Jul, 2018 12:49 IST|Sakshi
కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర  

సత్తుపల్లి: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం హల్‌చల్‌ చేశారు. ఓ కేసుకు సంబంధించి కొందరిని ఎస్సై నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అధికార పార్టీ వారిని వదిలిపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులను మాత్రం స్టేషన్‌లోనే ఉంచారు. వారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్‌ చేసి చెప్పారు. ‘‘ఎస్సైకి ఫోన్‌ ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మెల్యే సండ్ర, లైన్‌లో ఉన్నారంటూ ఫోన్‌ను ఎస్సైకి ఆ అనుచరులు ఇవ్వబోయారు. ఎస్సై తీసుకోలేదు. ఇదే విషయాన్ని సండ్రకు అనుచరులు చెప్పారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన సండ్ర వెంకటవీరయ్య, వెంటనే సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. లారీ యూనియన్‌ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతున్నదన్న సమాచారంతో అప్పటికే అక్కడకు ఎస్సై వెళ్లిపోయారు. పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై లేకపోవడంతో ఆయన సెల్‌కు సండ్ర ఫోన్‌ చేశారు.

ఎత్తకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ స్టేషన్‌ వ్యవహారాలు చూసేది ఎస్సైనా? అధికార పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్యే ఫోన్‌కు ఎస్సై స్పందించకపోతే ఎలా..? దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా..?’’ అంటూ, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పూచీకత్తుపై అధికార పార్టీ వారిని పంపిస్తారు. మా వాళ్లను మాత్రం పంపించకుండా నిర్బంధిస్తారా..?’’ అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచే కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.  

అసలు విషయం ఏమిటంటే... 

సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీరిలో నలుగురిని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడిపించుకుని వెళ్లారు. టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరిని పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. ఇది, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కోపం తెప్పించింది. ఆయన తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చారు. 

ఫోన్‌ సిగ్నల్స్‌ లేవు.. 

దీనిపై ఎస్సై నరేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘లారీ యూనియన్‌ కార్యాలయం వద్ద రాస్తారోకో జరుగుతున్నదని తెలియడంతో నేను అక్కడకు వెళ్లాను. అక్కడ సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవటంతో నాకు ఎటువంటి ఫోన్‌ రాలేదు’’ అని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’

అది వినాశనానికి దారి తీస్తుంది:హరీశ్‌ రావు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

పరిశ్రమలు మూత! 

సెలవొస్తే.. ‘సాగు’కే..! 

అప్పుల పాలన

అన్నను చంపిన తమ్ముడు

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

గెస్ట్‌ లెక్చరర్లపై చిన్నచూపు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

ఉద్యమానికి సై అంటున్న జనగామ

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

గతమెంతో ఘనం..నేడు కనుమరుగు

కాంబో కథ కంచికేనా?

నిరసన ఉద్రిక్తం

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

కంప్లైంట్ ఈజీ..!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ

లీజ్‌ డీడ్‌తో పాగా..

ఉన్నది ఒక్కటే గది..కానీ బడులు మూడు

గో ఫర్‌ నేచర్‌

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఇక ఎత్తిపోసుడే

నిరుద్యోగుల ధైర్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

భార్య, భర్త మధ్యలో ఆమె!