జరిమానా వసూళ్లలో జిల్లాకు రెండోస్థానం

24 Jul, 2014 04:00 IST|Sakshi
జరిమానా వసూళ్లలో జిల్లాకు రెండోస్థానం

వాహనాల తనిఖీల్లో..
జూన్‌లో 4,365 కేసుల్లో రూ. 4.54 లక్షలు వసూలు
 నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. గతనెల లో 4,365 కేసులు నమోదు చేసి రూ. 4,54,300 జరిమానాగా వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిబ్బంది ప్రతి రోజూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలు లేనివారికి జరిమానా విధిస్తున్నారు. జరిమానా ల వసూళ్లలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాద్ రెండోస్థానంలోఉండడం గమనార్హం.
 
జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం బైక్‌లు చోరీలకు గురవుతుండడం, మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నవారి వల్ల, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఆటోల వల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీ సులు ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించా రు. వాహనాల తనిఖీని ము మ్మరం చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు 3,800 కేసులు నమోదు చేసి రూ. 3,92,600 జరిమానాగా విధించారు.

మరిన్ని వార్తలు