డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత.. 

7 Dec, 2019 09:58 IST|Sakshi
డీఎస్పీ, సీఐలకు సూచనలిస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు

సాక్షి, మహబూబ్‌నగర్‌: నిందితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత వాయిదా పడడంతో జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఫ్రీజర్‌లు లేకపోవడంతో బయటి నుంచి తెప్పించి మృతదేహాలను అందులో ఉంచారు. ఈ క్రమంలో వసతులు లేవని, మృతదేహాలను భద్రపరిచేందుకు సరైన వసతులు లేవని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది.  

వాయిదా పడిన అంత్యక్రియలు

శవాలను పూడ్చేందుకు తీసిన గోతులు  

జక్లేర్‌లో మహ్మద్‌ ఆరీఫ్‌ పాషాను ముస్లింల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు ఆ గ్రామ మైనార్టీలు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్లలో తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు నవీన్, శివ, చెన్నకేశవులు కుటుంబీకులు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గుంతలను తవ్వించారు. అంత్యక్రియలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందుండి గుంతలను తవ్వించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతమైన వాతావరణంలో అంత్యక్రియలు జరపాలని పోలీసు యంత్రాంగం ప్రణాళికతో అంచనా వేసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్, హైకోర్టు ఆదేశాలతో చివరకు మృతదేహాలు గ్రామాలకు చేరుకోకపోవడంతో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. 

మరిన్ని వార్తలు