కొలువుల క్రమబద్ధీకరణ ఏదీ..?

4 Nov, 2017 14:25 IST|Sakshi

సిరిసిల్లటౌన్‌: రాష్ట్ర సర్కారు చెప్పేదొకటి...చేసేదొకటి అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట సెర్ప్‌ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. సమ్మె ప్రభావం గ్రామీణ మహిళలు, రైతులు, ఆసరా ఫించన్లపై పడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. దీక్షల్లో పర్శరాములు, వాణిశ్రీ, రేణుక, శ్రీదేవి, బాలరాజు,సెర్ప్‌ ఉద్యోగుల సంఘం నాయకులు పవన్, నర్సయ్య ఉన్నారు. 

కేకే. సంఘీభావం 
శాంతియుతంగా సమ్మె చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను సర్కారు స్పందించాలని లేని పక్షంలో తమ పార్టీ ఆ ధ్వర్యంలో సైతం ఉద్యమం చేపడుతామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే. మహేందర్‌రెడ్డి అన్నారు.సెర్ప్‌ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెర్ప్‌ ఉద్యోగులకు పనికి తగిన వేతనా లివ్వాలని డిమాండ్‌ చేశారు.నాయకులు జాలుగం ప్రవీన్, బైరినేని రాము, బుస్సా వేణు, మునిగెల రాజు, సీఐటీ యూ, ఏఐటీయూసీ నాయకులు మోర అజయ్‌ ఉన్నారు.  

మరిన్ని వార్తలు