అమ్మా..’ భిక్షాం దేహి...

29 Apr, 2016 02:43 IST|Sakshi
అమ్మా..’ భిక్షాం దేహి...

కుమారులు పట్టించుకోకపోవడంతో వృద్ధురాలి తిప్పలు
 
పెంబర్తి(జనగామ) : నవమాసాలు పెంచి, పోషించిన తల్లి వృద్ధ్యాపానికి వచ్చే సరికి పిల్లలు ప్రయోజకులవుతారు. ఈ నేపథ్యం లో వారిపై తల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఇద్దరు కొడుకులు, ఇందులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా... తల్లిని పట్టించుకోకపోవడంతో ఆమె గ్రామంలో భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం భిక్షాటనతో కడుపు నింపుకుం టూ రాత్రి గ్రామపంచాయతీ ఆవరణలో ఐదు రోజులుగా తలదాచుకుంటున్న జనగామ మండలం పెంబర్తికి చెందిన దైద పద్మ వ్యధ ఇది. పద్మ భర్త 20 ఏళ్ల క్రితమే కన్నుమూయగా ఇద్దరు కుమారుల ను ఆమె పెంచి పోషించింది.

ఈ మేరకు పెద్దకుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, మరో కుమారుడు హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం పద్మకు వృద్ధాప్య పింఛన్ వచ్చినా కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంగా తర్వాత నిలిపివేశారు. తాజాగా తన వద్ద తల్లిని చిన్నకుమారుడు.. పెద్దకుమారుడి వద్దకు వెళ్లాలని పంపిస్తే ఆయన రానివ్వలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని వృద్ధురాలు పద్మ విధిలేని పరిస్థితు ల్లో గ్రామపంచాయతీలోని ఓ బెంచీపై పడుకుంటూ కాలం వెళ్లదీస్తోం ది.

ఆమె దీనస్థితి చూడలేక స్థానికులు భోజనం పెడుతుండగా.. ఎవరూ పెట్టకపోతే ఆమె వెళ్లి భోజనం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పద్మ విలేకరులతో మాట్లాడుతూ ‘గింత బువ్వ.. పడుకునేం దుకు ఓ మూలన జాగా ఉంటే చాలు.. అంత కంటే నాకేం కావాలె బిడ్డా.. అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకోవడం మిగతా వారిని కదలించింది.

మరిన్ని వార్తలు