అవతరణ ఉత్సవాలు ఘనంగా జరపండి

26 May, 2017 03:00 IST|Sakshi
అవతరణ ఉత్సవాలు ఘనంగా జరపండి

అవతరణ ఉత్సవాలు ఘనంగా జరపండి
జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రావతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. గురువారం సచివాల యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం, కేసీఆర్‌ కిట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ప్రాణాలర్పిం చిన అమరవీరులకు అమరవీ రుల స్థూపం వద్ద నివాళులర్పించి తర్వా త పరేడ్‌ గ్రౌండ్స్‌లో పతాకా విష్కరణ, పరేడ్, ప్రసం గం, అవార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. హైదరా బాద్, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, కార్యా లయాలు, బ్యాంకులు, హోటళ్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించేలా చూడాలని.. హోటళ్లు, అసోసియేషన్లు, యూనియన్లు వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ రంగాలలోని కృషి చేసిన 11 మందికి అవార్డులను ప్రదానం చేయాలని.. స్క్రీనింగ్‌ కమిటీతో, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఆమోదంతో అవార్డుల లిస్టు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.

మరిన్ని వార్తలు