రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

30 Jul, 2015 23:58 IST|Sakshi

భగవంతుడి సేవలో అందరం సమానమే
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
 
 ఆదిబట్ల : స్వరాష్ట్రంలో గురు పౌర్ణమి పండగను మతాలకతీతంగా జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న చతుర్థ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి  పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఇక్కడి సాయిబాబా మందిరం ఎంతో ప్రసిద్ధిగాంచుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

అంతకుముందు సాయిబాబా ఆలయంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. దేవాలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, మాజీ సర్పంచ్‌లు కొత్త యాదగిరి గౌడ్, కొత్త ప్రమీల, కాకి భూపాల్, దేవాలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకోల్ చంద్రకళా రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు