ఏకరూపం.. అయ్యేనా సిద్ధం!

23 Apr, 2018 12:39 IST|Sakshi
కత్తెరసాలలో యూనిఫాంలు కుడుతున్న దర్జీ

పాఠశాలలు తెరిచే నాటికిఏకరూప దుస్తులు

ఇప్పటికే అన్ని పాఠశాలలకు వస్త్రాలు

ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున పంపిణీ

చెన్నూర్‌రూరల్‌: కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, తదితర సదుపాయాలను సమకూరుస్తోంది. ఏకత్వ భావనతో పాటు, విశ్వాసం పోగవుతుందనే ఆశయంతో ఏకరూప దుస్తుల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. లక్ష్యం బాగానే ఉన్నప్పటికి విద్యా సంవత్సరం గడిచినా కొన్ని ప్రాంతాలలో దుస్తులు అందని సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులందరికీ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలకు గాను 671 పాఠశాలలు ఉండగా, 45,288 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున దుస్తులను అందజేస్తారు. డీఈవో ఆదేశాల ప్రకారం ఎంఈవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీలతో కలిసి దుస్తులు కుట్టించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది ఒక జతకు రూ.40 చెల్లిస్తే, ఈ ఏడాది ఒక జతకు రూ.50 అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది జతకు రూ.10 పెంచి అందజేస్తోంది.

పాఠశాలలకు చేరిన వస్త్రం
అన్ని మండలాల్లోని మండల విద్యావనరుల కేంద్రాలకు వారం రోజుల క్రితం వస్త్రాలు వచ్చాయి. ఇక్కడ నుంచి పాఠశాలల సముదాయాల వారిగా సరఫరా  చేశారు. మండలాల్లోని అన్ని పాఠశాలలకు దాదాపు వస్త్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకువెళ్లి యూనిఫాంలు కుట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. దర్జీలను పిలిపించి కొలతలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 14,878 మీటర్లు వస్త్రాన్ని పంపిణీ చేశారు. జూన్‌ 1న పాఠశాలలు పునః ప్రారంభం కావడాన్ని దృష్టిలో పెట్టుకొని బడులు తెరిచే నాటికి విద్యార్ధులకు ఏకరూప దు స్తులను అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముం దుకు Ðð ళ్తోంది. పాఠశాలలు పునః ప్రారంభమైన మొద టి వారంలోనే విద్యార్థులకు కొత్తగా అందజేసిన ఏకరూప దుస్తులతో పాఠశాలలకు రావాలని నిర్ణయిం చారు. గతంలో ఏకరూప దుస్తులు సకాలంలో అందక పాత వాటితో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేవారు. కానీ ఈ ఏడాది ముందస్తుగా ఏకరూప దుస్తులను వి ద్యార్థులకు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఏకరూప దుస్తులతో పాఠశాల పునః ప్రారంభంలోనే కనిí ³ంచనున్నారు. ఒక్క జత స్కూల్‌ యూనిఫాం కుట్టేం దుకు రూ. 50 సరిపోవని దర్జీలు వాపోతున్నారు. దీం తో విద్యార్థుల తల్లిదండ్రులు అదనంగా వారికి రూ.30 చెల్లిస్తున్నారు. మొత్తం రూ.80కి ఒక జత యూనిఫాంను కుడుతున్నారు.

పాఠశాలల ప్రారంభంలోనే అందిస్తాం
ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 1వ తేదీన పునఃప్రారంభిస్తాం. బడులు తెరిచే నాటికే ఏకరూప దుస్తులు కుట్టించడం పూర్తయ్యి, మొదటి వారంలోనే విద్యార్ధులు ఏకరూప దుస్తులతో పాఠశాలలకు రావాలని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఎప్పటికప్పుడు దుస్తులు కుట్టించేందుకు ఇచ్చిన దర్జీలతో మాట్లాడి మే నెల చివరి వారం వరకు ఏకరూప దుస్తులు తెప్పించాలి.
– వెంకటేశ్వర్‌రావు, ఇన్‌చార్జి డీఈవో

మరిన్ని వార్తలు