రెండేళ్లుగా రాయితీ రాలేదు

11 Mar, 2018 01:40 IST|Sakshi

నాయీబ్రాహ్మణులకు తప్పని నిరీక్షణ

సంఘాలకు 2.22 కోట్ల పెండింగ్‌

సిరిసిల్ల: వివిధ సామాజిక వర్గాలకు మెరుగైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో తీరని జాప్యం చోటుచేసుకుంటోంది. నాయీబ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసిన సర్కారు.. రెండేళ్లు దాటినా సబ్సిడీ సొమ్ము విడుదల చేయ డంలేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన 17 సంఘాల్లోని 222 మంది తమకు రావా ల్సిన దాదాపు రూ.2.22 కోట్ల రాయితీ కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో సెలూన్‌ ఏర్పాటు కోసం రూ.2 లక్షలు రుణంగా అందిస్తుండగా, ఇం దులో రూ.లక్ష వరకు రాయితీ వర్తింపజేస్తోంది.

ఏం జరిగిందంటే.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 కోట్లతో నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సహకార సంఘాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించింది. దీంతో 12– 15 మంది సభ్యులతో కూడిన సంఘాలను రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఒక్కో సంఘానికి రూ.12 లక్షల – రూ.15 లక్షల వరకు సబ్సిడీ అందించాలని, అంతే మొత్తంలో అంటే.. రూ.12 లక్షల – రూ.15 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా ప్రతిపాదనలు తెప్పించారు.

అప్పుల పాలైనం
లోను వస్తదనే ఆశతో సంఘం రిజిస్ట్రేషన్‌ చేయించినం. అప్పు తెచ్చి బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్‌ జేసినం. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా రాయితీ పైసల్‌ వస్తలెవ్వు. రెండేండ్ల సంది మిత్తి పెరుగుతూనే ఉంది. – పయ్యావుల లక్ష్మీనర్సయ్య, లబ్ధిదారు

మరిన్ని వార్తలు