ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్‌ బస్‌ ఏర్పాటు

25 May, 2019 08:19 IST|Sakshi
నిలిచిపోయిన బస్సు వద్ద ఆందోళన చేస్తున్న ప్రయాణికులు

ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్‌ బస్‌ ఏర్పాటు  

చెడిపోయి మధ్యలోనే నిలచిపోయిన బస్సు  

అర్ధరాత్రి ప్రయాణికుల ఆందోళన

మన్సూరాబాద్‌: ఓల్వో బస్‌కు టెకెట్లు బుక్‌ చేసుకుంటే నాసిరకం హైటెక్‌ బస్సు (టీఎస్‌ 12 యూబీ 3645)ను పంపిన ఎస్వీఆర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం.. పంపిన బస్సు నగరం దాటకుండనే మార్గమధ్యంలో నిలిచిపోయిన సంఘటన శుక్రవారం రాత్రి ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్వీఆర్‌ ట్రావెల్స్‌లోని ఓల్వో బస్‌లో నగరం నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయాణికులు టెకెట్లు బుక్‌ చేసుకున్నారు. సదరు ట్రావెల్స్‌ బస్సు ఎల్‌బీనగర్‌కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉంది.

ప్రయాణికులు పలు మార్లు ఫోన్‌ చేయగా ఎస్వీఆర్‌ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు హైటెక్‌ బస్సును పంపించింది. తీరా బస్సు చింతలకుంటకు రాగానే చెడిపోయి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు యాజమాన్యానికి ఫోన్‌ చేసి సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి అందోళనకు దిగారు. సాయంత్రం 6.30 నుంచి బస్సు కోసం ఎదరుచూస్తున్నామని, బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎర్పడిందని ఆవేదన చెందారు. ఎస్వీఆర్‌ ట్రావెల్స్‌ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే తామంతా అవస్థలు పడుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్వీఆర్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

బిగ్‌బాస్‌ ప్రసారం నిలివేయాలి

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!