75,307 దరఖాస్తులు 

12 Jun, 2018 02:34 IST|Sakshi

ముగిసిన టీచర్ల బదిలీ దరఖాస్తు ప్రక్రియ 

కేటగిరీ పాయింట్లపై ఉపాధ్యాయుల ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. సోమ వారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 75,307 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి బదిలీల ప్రక్రియకు భారీ స్పందన వచ్చింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారంతా బదిలీకి అర్హులని విద్యా శాఖ సూచించడంతో ఆ మేరకు అర్హత ఉన్న టీచర్లంతా ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో వాటి పరిశీలనకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని ఎలా పరిశీలించాలనే అంశంపై విద్యా శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 


సందేహాలపై స్పష్టత కరువు.. 
బదిలీలకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయుల సందేహాలపై విద్యాశాఖ మౌనం ప్రదర్శిస్తోంది. ప్రధానంగా మెడికల్‌ కేటగిరీకి సంబంధించి కొన్ని రకాల వ్యాధులనే ప్రిఫరెన్షియల్‌ కోటాలో నమోదు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన వ్యాధులను పేర్కొన్నప్పటికీ వాటిని పక్కాగా నిర్దేశించలేదని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో వ్యాధులను నిర్ధారిస్తే అందరికీ న్యాయం జరిగేదని ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి.సదానంద్‌గౌడ్‌ పేర్కొన్నారు. స్కూళ్ల కేటగిరీ పాయింట్ల కేటాయింపుపై ఉన్న అపోహలు ఇంకా తొలగలేదు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకూ ప్రత్యేక పాయింట్లు ఇచ్చినప్పటికీ.. ఆ నిబంధనలో స్పష్టత లేదని, దీంతో పాత సర్టిఫికెట్లతో ఈ పాయింట్లు పొందుతున్నట్లు పలువురు టీచర్లు ఆరోపిçస్తు న్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని టీచర్లకు బదిలీ ప్రక్రియలో పాయింట్లు ఇస్తుండగా.. వాటిని గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర గెజిటెడ్‌ హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, చంద్రప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు