తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

19 May, 2018 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్‌ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంటర్నల్స్‌ స్లైడింగ్‌ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు.

ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్‌ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్‌ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ర్యాంక్లు

1. వెంకట పాని వంశీనాథ్(మాదాపూర్)
2. గట్టు మైత్రేయ (మాదాపూర్)
3.వినాయక (రంగారెడ్డి)
4. హేమంత్ కుమార్ (విశాఖపట్నం)

5.మదన్ మోహన రెడ్డి (విజయవాడ)
6. భరత్  (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం)
7. యస్కర్ (హైదరాబాద్‌ మదీనాగూడ)
8. రిశీయంత్ (హన్మకొండ)
9. షేక్ వాజిద్ (రంగారెడ్డి)
10.వెంకట మల్లిబాబు (రంగారెడ్డి)

అగ్రికల్చర్,  ఫార్మసీ ర్యాంకులు

1.  నమ్రత -కర్నూలు
 2. సంజీవ్ కుమార్- హైదరాబాద్
3. శ్రీఆర్యన్, ఆర్మూర్
4.సంజన -మల్కాజ్‌గిరి
5. జయసూర్య-హైదరాబాద్
6. గంజికుంట శ్రీవత్సావ్‌-ఆదోని
7. విచిత్- గోదావరి ఖని
8. అనగ లక్ష్మి- దిల్ సుఖ్ నగర్
9. శ్రీ చైతన్య- కరీంనగర్
10.సత్యశ్రీ సౌమ్య- ఖమ్మం

మరిన్ని వార్తలు