బీసీ విద్యార్థులకు దీపావళి కానుక

27 Oct, 2019 02:30 IST|Sakshi

1,196.58 కోట్లు ఉపకార బకాయిల చెల్లింపులకు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: బీసీ విద్యార్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతన, ఫీజురీయిం బర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన బడ్జెట్‌కు అనుగుణంగా రూ.1,196.58 కోట్లకు సంబంధించిన బడ్జెట్‌ రిలీజింగ్‌ ఆర్డర్‌లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థ సారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడడమే తరు వాయి బీసీ సంక్షేమ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది.

ఈ నిధు లతో 2017–18, 2018–19 బకాయి లను దాదాపు క్లియర్‌ చేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధుల కేటాయింపులు  ఉండ డంతో విద్యా ర్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతుండడంతో పంపిణీ ఆలస్య మైంది. తాజాగా ఆమోదించిన పద్దుల్లో బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకా లతోపాటు బీసీల కులాంతర వివాహ ఆర్థిక సాయం తదితరాలున్నాయి. ఇందులో ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కేటగిరీల్లో నిధులు విడుదల చేయడంతో ప్రాధాన్యతా క్రమంలో సమాన నిధులు ఇచ్చే వీలుంటుంది.


 

మరిన్ని వార్తలు