‘ఫీజు’ నియంత్రణ హుళక్కే!

23 Mar, 2017 03:15 IST|Sakshi
‘ఫీజు’ నియంత్రణ హుళక్కే!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశా లల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలు బుట్టదాఖల య్యాయి. విద్యాశాఖ ఆరు నెలల పాటు కసరత్తు చేసి, ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై మూడు నెలల కిందటే ప్రభుత్వ ఆమో దానికి ప్రతిపాదనలు పంపితే.. తాజాగా ప్రభు త్వం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో 31.28 లక్షల మంది విద్యార్థులు చదివే 11,470 ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియం త్రణకు ఇప్పుడో అప్పుడో ఉత్తర్వులు వస్తాయి.. నియంత్రణ చర్యలు ప్రారంభం అవు తాయని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తరు ణంలో దీనిపై ప్రభుత్వం మరో కమిటీని ఏర్పా టు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

దీంతో ఫీజుల నియంత్రణ ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తిరుపతి రావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా కమిషనర్‌ కన్వీనర్‌గా, తల్లిదండ్రుల కమిటీ నుంచి, పాఠశాలల యాజ మాన్యాల నుంచి కొందరు సభ్యులు ఉంటారని పేర్కొంది. ఫీజుల నియంత్రణకు మార్గదర్శకా లను రూపొందించి, కమిటీ ఏర్పాటైన నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఫీజల నియంత్రణపై నీళ్లు చల్లినట్లు అయింది. 2017–18 విద్యా సంవత్సరంలో ఫీజుల నియం త్రణకు పక్కాగా చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే.. ఆ ప్రతిపాద నలను పక్కనపెట్టి, మరో కమిటీని వేయడమేం టని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈనెల 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో యాజమాన్యాలు ఇష్టా రాజ్యంగా ఫీజులను పెంచి వసూళ్లకు సిద్ధమయ్యాయి.

విద్యాశాఖ కసరత్తు గాలికి...
ఆరు నెలల కిందట విద్యాశాఖ కమిషనర్‌ తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమై, వారి సూచనలు, సలహాలు స్వీకరించి, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పాఠశాల యాజమాన్యం ఆమోదంతో కరస్పాండెంట్‌/సెక్రటరీ పాఠశాలల ఆదాయ (వసూలు చేసిన ఫీజు), వ్యయాలకు సంబంధించిన (టీచర్ల వేతనాలు, సదుపాయాలు, టీచర్ల సంక్షేమం, నిర్వహణ ఖర్చులు) ఆధారాలతో తమ పాఠశాలల్లో వసూలు చేసే ఫీజులను తరగతులు వారీగా ఖరారు చేసి జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీకి (డీఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదిస్తారు. ఆ ప్రతిపాదనలు నిర్ణీత వ్యవధిలో ఆన్‌లైన్‌లో వచ్చాక.. జిల్లా జాయింట్‌ కలెక్టర్, ఆడిట్‌/పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సభ్యులుగా, డీఈవో సభ్య కన్వీనర్‌గా ఉండే డీఎఎఫ్‌ఆర్‌సీ పరి శీలిస్తుంది. వసూలు చేసిన ఫీజులు, అయిన ఖర్చుల్లో తేడాలు ఉన్నా, యాజమాన్యం ప్రతిపాదనల్లో లోపాలు ఉన్నా డీఎఫ్‌ఆర్‌సీ ఆయా యాజమన్యాలతో చర్చించి, తమ సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుం ది.

ఇలా అన్ని జిల్లాల్లోని డీఎఫ్‌ఆర్‌సీల నుంచి పాఠశాల వారీగా వచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి తుది ఫీజును ఖరారు చేయనుంది. ఆ ఫీజునే పాఠశాలల్లో వసూలు చేసేలా ప్రతిపాదనలు పంపించారు. అంతే కాదు.. ఏ రకమైన పేరుతోనూ పాఠశాల యాజమాన్యం డొనేషన్‌ వసూ లు చేయడానికి వీల్లేదని, వన్‌టైమ్‌ ఫీజు కింద.. దరఖాస్తు ఫీజు రూ. 100 లోపు ఉండాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 500 లోపే ఉండా లని, తిరిగి చెల్లించే (రిఫండబుల్‌) విధానంలో కింద రూ. 5 వేలలోపే కాషన్‌ డిపాజిట్‌ ఉండాలని అందులో ప్రతిపాదించారు. నిర్ణయించిన ఫీజు లో 50 శాతం డబ్బును టీచర్ల వేతనాలకు, 15 శాతం టీచర్ల సంక్షేమానికి, 15 శాతం పాఠశాల నిర్వహణకు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతు లకు వెచ్చించాలని, 5 శాతమే యాజమాన్యం లాభంగా తీసుకునేలా ప్రతిపాదిస్తే వాటన్నింటిని పక్కనపెట్టి కమిటీ వేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు