మూడోవిడత హరితహారం ప్రారంభం..

12 Jul, 2017 13:31 IST|Sakshi
మూడో విడత హరితహారం ప్రారంభం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్‌లో ప్రారంభించగా మంత్రుల జిల్లాకేంద్రాల్లోని కార్యక్రమంలో పాల్గొని మొక్కటు నాటారు.
 
మొక్కలు నాటిన కడియం
 వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని 4వ బెటాలియన్ క్యాంపు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆమ్రపాలి, పోలీసు కమిషనర్‌ సుధీర్ బాబు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
 
 
 
 
బొటానికల్ గార్డెన్‌లో  మంత్రి కేటీఆర్‌  
హైదరాబాద్ : మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగాబొటానికల్ గార్డెన్‌లో హరిత హారం ‌కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ హాజరయ్యారు. గార్డెన్‌లోని ముప్పై ఎకరాల్లో ఏడు వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మూసారాంబాగ్‌లోని స్వామి వివేకానంద ఉన్నత పాఠశాలలో విద్యార్థులలు, కార్పొరేటర్ సునరితారెడ్డి, మలక్‌పేట్ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్ ఆజం ఆలీలతో కలిసి మేయర్‌ మొక్కలు నాటారు. 
 
మొక్కల శాతం పెరగాలి: డీజీపీ అనురాగ్‌శర్మ
యాచారం: మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డిజిల్లా యాచారం పోలీసులు స్టేషన్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొక్కల శాతం తక్కువగా ఉందని, 33 శాతం ఉండాల్సి ఉండగా 24 శాతం మాత్రమే ఉందని తెలిపారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. అలాగే మంచాల పోలీసు స్టేషన్‌లోనూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు