గందరగోళంలో తెలంగాణ పాలిటెక్నిక్‌ కౌన్సిలింగ్‌

12 May, 2019 20:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని తెలంగాణ సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు తిరస్కరించడంతో తెలంగాణ పాలిటెక్నిక్‌ కౌన్సిలింగ్‌లో గందరగోళం నెలకొంది. మంగళవారమే కౌన్సిలింగ్‌ ఉండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు.  రాష్ట్రంలో ఉన్న 187 కాలేజీల్లో 162 కాలేజీలకు మాత్రమే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కాగా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన 162 కళాశాలలో 100పైగా కాలేజీలకు తెలంగాణ సాంకేతిక విద్యామండలి అనుమతి నిరాకరించింది.

చదవండి : ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలపై సర్కార్‌ కొరడా

ప్రతీ కాలేజీలో ఉన్న సీట్ల అన్నింటికి మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని సాంకేతిక విద్యామండలి తేల్చిచెప్పింది. సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యం తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి మూడేళ్ల అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించమనడం సరికాదన్నారు. దీంతో తెలంగాణ సాంకేతిక విద్యామండలి  మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుము చెల్లించాల్సిందే అంటూ 100కు పైగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును తిరస్కరించింది. విద్యామండలి విధించిన నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం నుంచే కౌన్సిలింగ్ ఉండటం తో గుర్తింపు వస్తుందా లేదా, కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ లో అటు విద్యార్థులకు, ఇటు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యానికి నెలకొంది.

మరిన్ని వార్తలు