తెలంగాణలో ‘ఆమె’ పరిస్థితి నయం

2 Jan, 2015 01:54 IST|Sakshi
తెలంగాణలో ‘ఆమె’ పరిస్థితి నయం
  • జాతీయస్థాయి లింగనిష్పత్తి కంటే మెరుగు
  • చిన్నారుల నిష్పత్తి అధ్వానం
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘ఆమె’ పరిస్థితి నయం. జాతీయస్థాయి లింగ నిష్పత్తితో పోలిస్తే తెలంగాణలో మెరుగ్గా ఉంది. చిన్నారుల నిష్పత్తి అధ్వానంగా ఉంది.  రాష్ట్ర అర్థ గణాంకశాఖ ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్-2015’ పేరుతో విడుదల చేసిన నివేదికలో లింగ నిష్పత్తి అంశాలను వివరించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 949 మంది మహిళలు ఉంటే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 999 మంది ఉన్నట్లు వెల్లడించింది.

    పట్టణాల్లో అయితే మహిళల సంఖ్య మరింత తగ్గిపోవడం గమనార్హం. దేశంలో ఈ లింగనిష్పత్తి ప్రతి వెయ్యి మంది పురుషులకు 929 ఉంటే.. తెలంగాణలో 970 మంది ఉన్నట్ల పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నిష్పత్తి మరింత తగ్గడం ఆందోళనకర పరిణామం. హైదరాబాద్‌లో 945 మంది మహిళలు ఉన్నట్లు వివరించింది. 0-6 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లల లింగ నిష్పత్తి పరిశీలిస్తే.. దారుణంగా పడిపోయింది. జాతీయస్థాయిలో వెయ్యి మంది బాలురకు 919 మంది బాలికలు ఉంటే.. తెలంగాణలో 933గా ఉన్నట్లు స్పష్టం చేసింది.
     
    విద్యాపరంగా: అక్షరాస్యతలో జాతీయ నిష్పత్తితో పోలిస్తే తెలంగాణలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. జాతీయస్థాయిలో 73 శాతం అక్షరాస్యులు ఉంటే తెలంగాణలో ఆ సంఖ్య 66.46 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల పరంగా చూస్తే దేశంలో 67.80 శాతం ఉంటే తెలంగాణలో 57.30, పట్టణాల పరంగా చూస్తే దేశంలో 84.10, తెలంగాణలో 81.10 శాతంగా ఉన్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.
     

>
మరిన్ని వార్తలు