త్వరలో టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు!

25 Jun, 2014 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. ఈ ఫైలుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమ్మతి తెలిపిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభ జన తర్వాత అప్పటివరకు ఉన్న ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పని చేస్తుందని, తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేస్తారని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం పేర్కొంది. అప్పటి వరకు.. ఏమైనా ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చూస్తుందని స్పష్టం చేసింది. సీఎం నేతృత్వంలోని బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నందున.. ఆయనే స్వయంగా టీఎస్‌పీఎస్సీ ఆమోదానికి, ఉత్తర్వుల జారీకి కేంద్రంతో చర్చించనున్నారు

మరిన్ని వార్తలు