నేటి ఉదయం దైవదర్శనాలుండవు

26 Dec, 2019 05:42 IST|Sakshi
యాదాద్రిలో...,తిరుమలలో...

సూర్య గ్రహణంతో ఆలయాల మూసివేత

శుద్ధి అనంతరం ప్రత్యేక దర్శనాలు

సాక్షి, హైదరాబాద్‌: సూర్యగ్రహణం కారణంగా గురువారం ఉదయం తెలుగు రాష్రాల్లోని ఆలయాలను  మూసివేయనున్నారు. ఉదయం 8.07 గంటలకు గ్రహణ స్పర్శ కాలం ప్రారంభం అవుతుండగా, మోక్ష కాలం ఉదయం 11.20 నిమిషాలకు ఉంది. మొత్తం మూడు గంటలకుపైగా గ్రహణ కాలం ఉంటుంది. ఆలయాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత దైవ దర్శనాలకు వీలుగా ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. కొన్ని దేవాలయాలను మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు. అన్ని దేవాలయాల్లో సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లోని ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ, పుణ్య హవాచనం, మహా నివేదన తదితర సేవల అనంతరం భక్తులను సర్వ దర్శనాలకు అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు