10 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 

8 Jun, 2019 01:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 260 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 7,642 పాఠశాలలకు చెందిన 61,431 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

అందులో 36,931 మంది బాలురు ఉండగా, 24,500 మంది బాలికలు ఉన్నట్లు వివరించారు. హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్‌లో www.bse.telangana.gov.in ఉంచినట్లు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటిపై సంతకం, స్టాంపు వేసి విద్యార్థులకు జారీ చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బంది కూడా పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు