నర్సింగ్‌ కాలేజీల సమస్యల పరిష్కారానికి కమిటీ

23 Jun, 2017 02:34 IST|Sakshi
నర్సింగ్‌ కాలేజీల సమస్యల పరిష్కారానికి కమిటీ

► నివేదికను సమర్పించేందుకు 15 రోజుల గడువు..

హైదరాబాద్‌: నర్సింగ్‌ కళాశాలల్లోని సమ స్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని వైద్యా రోగ్యశాఖ నిర్ణయించింది. 15 రోజుల్లో కమిటీ నివే దిక ఇచ్చేలా గడువు విధించాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. గురువారం వెంగళరావు నగర్‌లోని  కుటుంబ  సంక్షేమశాఖ  కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి   అధికారులతో  సమీక్షించారు.  డిగ్రీ,  జీఎన్‌ఎం  వంటి  చదువుల  ద్వారా  నర్సుల నియామకాలు  జరుగుతున్నాయి. ఈ విషయంలో  రకరకాల సమస్యలు  నెలకొన్నాయి.  వాటితో పాటు మానవ వనరులు,  మౌలిక  సదుపాయాలు, అకడ మిక్‌  వ్యవహారాల వంటి  వాటి మీద అధ్యయనం  చేసి నివేదిక  ఇవ్వాలని  మంత్రి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రాజేశ్వర్‌  తివారీని  ఆదేశించారు.  

పాలమూరు వైద్యకళాశాలకు ఎల్‌ఓపీ..
పాలమూరు వైద్య కళాశాలకు రెండో ఏడాది కూడా లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) లభించింది. సమావేశంలో దీనిపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలె క్టర్లు, డీఎం,హెచ్‌ఓ సంబంధిత శాఖల ఉన్నతా ధికారులు సమన్వ యంతో సమస్యలను అధిగమిం చాలని సూచించారు. ఈ సమావేశంలో పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ,  మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌  రొనాల్డ్‌రాస్, డీఎం ఈ రమణి, డీహెచ్‌ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.  

గ్రామీణ వైద్యులకు శిక్షణ...
గ్రామీణ వైద్యులకు గతంలో ప్రారంభించిన శిక్షణ వివిధ స్థాయిల్లో ఆగిపోయింది. దీంతో మళ్లీ శిక్షణ షెడ్యూల్‌ సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 శిక్షణ కేంద్రాలున్నాయి. వాటికి అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయా లని, పది రోజుల్లో షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు