రైతు ఆత్మహత్య

24 Sep, 2015 09:06 IST|Sakshi

అప్పు చేసి పొలంలో వేయించిన బోర్లలో నీరు పడకపోవటం ఆ రైతును కుంగదీసింది. దీంతో తీవ్ర ఆవేదనతో పురుగు మందుతాగి తనువు చాలించాడు. మెదక్ రామాయంపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి శ్రీనివాసరెడ్డి(50)కి రెండెకరాల పొలం ఉంది. నీటి వసతి కోసం పొలంలో గత మూడేళ్లలో రెండు బోర్లు వేయించాడు. అవి ఫెయిలయ్యాయి. పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు రూ.5 లక్షల దాకా పెరిగిపోయాయి. పొలం బీడుగా మారింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం ఇంట్లోనే క్రిమి సంహారక మందు తాగి, తనువు చాలించాడు. ఆయనకు భార్య మంజుల, కుమార్తె, వృద్ధురాలైన తల్లి ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు