పులి చర్మం ఎక్కడిదీ..?

5 Apr, 2018 13:11 IST|Sakshi
పులి చర్మాన్ని చూపిస్తున్న పోలీసులు, వెనుక నిల్చున్న వారిలో శ్యాంరావు (మూడో వ్యక్తి)

లక్సెట్టిపేటలో పట్టుకున్న పోలీసులు 

చర్మం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

దాదాపు పది మంది ప్రమేయం?

దర్యాప్తు జరుపుతున్న ఖాకీలు 

లక్సెట్టిపేట(మంచిర్యాల) : జాతీయ జంతువు పులి చర్మాన్ని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దానిని తరలిస్తున్న కుమురం భీం జిల్లా తాటినగర్‌ గ్రామానికి చెందిన రౌతు శ్యాంరావును అరెస్టు చేశారు. పులి చర్మం ఎక్కడినుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాంరావు గతంలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పట్టణానికి చెందిన రఘు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు పులి చర్మం కావాలని, తెచ్చిస్తే రూ.5లక్షలు ఇస్తానని శ్యాంరావును రఘు కోరాడు. దీంతో శ్యాంరావు బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన విలాస్‌ అనే వ్యక్తిని సంప్రదించాడు.

తనకు పులి చర్మం తెచ్చిస్తే రఘుకు అందజేస్తానని, అతడు ఇచ్చే డబ్బులను ఇద్దరం కలిసి పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. విలాస్‌ కొద్ది రోజుల తర్వాత పులి చర్మాన్ని తీసుకువచ్చి శ్యాంరావుకు ఇచ్చాడు. శ్యాంరావుæ పులి చర్మాన్ని వాహనంలో తీసుకుని బుధవారం కొత్తగూడెం బయల్దేరాడు. ఈ క్రమంలో లక్సెట్టిపేట ఎన్‌టీఆర్‌ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిçండగా శ్యాంరావు అనుమానాస్పదంగా కనిపిచండంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సంచిని తెరిచి చూడగా అందులో పులి చర్మం లభించిందని సీఐ తెలిపారు. శ్యాంరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. రఘు, విలాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మధుసూదన్‌రావు, కానిస్టేబుల్‌ శేఖర్‌ పాల్గొన్నారు. 
పది మంది ప్రమేయం.. ?
పులి చర్మం తరలింపు సంఘటన వెనుక దాదాపు పది మంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మర్తిడికి చెందిన విలాస్‌ వన్యప్రాణులను వేటాడుతాడని తెలిసింది. అయితే ఈ పులి చర్మం అతడికి ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు కూపీ లాగుతున్నారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి కొంత మంది వ్యక్తులు పులి చర్మాన్ని తరలిస్తుండగా బెజ్జూర్‌ మండలంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పులి చర్మం బెజ్జూర్‌లోని అటవీ శాఖ క్వార్టర్‌లో భద్రపర్చగా.. కొద్ది నెలల క్రితం మాయమై.. మమచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో దొరికిన సంగతి విదితమే.

తాజాగా పట్టుబడిన పులి చర్మం కూడా గతంలో వలె మహారాష్ట్ర నుంచి వచ్చిందా? లేక కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో సంచరిస్తున్న పులిని హతమార్చి ఉంటారా? అని∙అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన విలాస్‌ పట్టుబడితే గాని పులి చర్మం ఎక్కyì  నుంచి వచ్చిందనేది అంతుచిక్కదు. విలాస్‌ కోసం పోలీసులు బుధవారం సాయంత్రం మర్తిడి గ్రామానికి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది. బెజ్జూర్‌ ఎస్సై లేకపోవడంతో చింతలమానెపల్లి ఎస్సై వచ్చినట్లు సమాచారం. కాగా.. మంగళవారం రాత్రి కొంత మంది వ్యక్తులు మండలంలోని సల్గుపల్లి అంగడి ప్రాంతంలో పులి చర్మం కోసం బేరసారాలు సాగించినట్లు తెలిసింది. ఇందులో మర్తిడికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులతో పాటు మొత్తం పది మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు