పెద్దపులి కనిపించిందోచ్‌!

15 Dec, 2018 15:45 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌‌: రాష్ట్రంలో ప్రముఖ టైగర్‌ కన్జర్వేషన్‌ జోన్‌ కవ్వాల్ అభయారణ్యంలో తాజాగా పెద్దపులి  కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెద్దపులి సంచారాన్ని దాదాపు ఏడాది తర్వాత గుర్తించారు. పెద్దపులి కదలికలు కెమెరా కంటికి చిక్కాయి. కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో మనుషులు, పశువుల సంచారం నియంత్రించడం.. గడ్డిక్షేత్రాలు భారీగా పెంచడంతో సత్ఫలితాలు ఇచ్చిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు