మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే...

22 Aug, 2014 16:55 IST|Sakshi
మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే...

హైదరాబాద్: నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ప్రతినిధులు కమలనాథన్‌ను కలిశారు. ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా జోనల్ పోస్టుల్లో  40 వేలకు పైగా ప్రాంతీయేతర ఉద్యోగుల్ని గుర్తించి వారి వివరాలు కమిటీకి సమర్పించామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. విభజన సమస్యలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనని ఆయన హెచ్చరించారు.

ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించాలని అంతకుముందు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్స్ వర్తింప చేయరాదని అన్నారు.

మరిన్ని వార్తలు