సవాళ్లు అధిగమించాలి

10 Aug, 2014 03:16 IST|Sakshi
సవాళ్లు అధిగమించాలి

సరికొత్త పరిశోధనలు చేయాలి 800 ఏళ్ల క్రితమే సాంకేతికతను ప్రవేశపెట్టిన కాకతీయులు  రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్  కనుల పండువగా నిట్ స్నాతకోత్సవం1427 మందికి పట్టాలు ప్రదానం
 
నిట్ క్యాంపస్: దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించేందుకు యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్, వరంగల్) 12వ స్నాతకోత్సవం నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అవినాశ్ చందర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు.

21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను అధిగమించేలా కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆయన నేటితరం ఇంజనీర్లను కోరారు. ఎనిమిది వందల ఏళ్లక్రితమే నిర్మాణం, సాగు నీటి రంగాల్లో సాంకేతికను ప్రవేశపెట్టిన కాకతీయుల గడ్డపై తాను ప్రసంగిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నిట్ బోర్డుఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్లా మాట్లాడుతూ  ఒక విజయం కోసం కల కనాలని, దాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, అప్పుడే విజయం వరిస్తుందన్నారు.

నిట్‌లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి విజయం సాధించారని చెప్పారు. ఆర్‌ఈసీ మొదటి బ్యాచ్ విద్యార్థి ఆంజనేయ శాస్త్రీ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారని, అంతేగాక నిట్ ఇనిస్టిట్యూట్ ఇంకుబేషన్ సెంటర్‌కు కోటి రుపాయలు ఇచ్చారన్నారు. అభివృద్ధికి పరిమితులు ఉండవని, యువ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
 
పరిశోధన రంగాన్ని అభివృద్ధి  చేయడానికి కృషి

నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నిధులతో టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం కింద నిట్‌లో పరిశోధనరంగం ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిట్‌లో 40మంది ప్యాకల్టీ మెంబర్లు, ఆరుగురు పీహెచ్‌డీ స్కాలర్లు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పించామన్నారు. ఈ సారి 1427మందికి స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని అందులో బిటెక్ గ్రాడ్యుయేట్లు 720 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 668 మంది, పీహెచ్‌డీ స్కాలర్‌లు 39మంది ఉన్నారన్నారు.

కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీకేయన్ మిశ్రా ఫేస్‌బుక్‌లో ఉద్యోగం సంపాదించి వార్షిక వేతనంగా రూ.70లక్షలు పొందుతున్నాడని తెలిపారు. నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతీష్‌కుమార్ ఫ్యాకల్టీ నుంచి ఆప్తాబ్‌ముప్తీ మెడల్‌ను సాధించాడన్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడానికి స్ప్రింగ్ స్త్రీ, టెక్నోజియూన్ ప్రతి ఏడాది నిట్‌లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. క్రీడాకారుల కోసం ఆల్ ఇండియా ఇంటర్ నిట్ స్పోర్ట్స్‌ను నిర్వహించామని ఆయన వివరించారు. నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు ఇంజనీరింగ్ పట్టభద్రులను వేదికపైకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలోఇంచార్జీ రిజిస్ట్రార్ ఎఆర్‌సిరెడ్డి, ప్యాకల్టీ వెల్పేర్ డీన్ ఎం.సైదులు, స్టూడెంట్స్ వెల్పేర్ డీన్ ఎస్ శ్రీనివాసరావు, ప్లానింగ్ డెవలప్‌మెంట్ డీన్ ఆర్‌ఎల్‌ఎన్ సాయి ప్రసాద్, రీసెర్చ్‌కన్సల్టెన్సీ డీన్ జీవీఎస్ నాగేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌లు సీబీ కామేశ్వర్‌రావు, కెవీ జయకుమార్, సీఎస్‌ఆర్‌కె ప్రసాద్, దేవ ప్రతాప్, ఎన్.సుబ్రమణ్యం, సి.గురుజారావు, జి.అంబప్రసాద్‌రావు, పులి రవికుమార్, కెఎస్‌ఆర్ కృష్ణానంద్, ఎన్‌వీఎస్‌ఎన్ శర్మ, జీవీఎస్ నాగేశ్వర్‌రావు, ఎన్.నర్సయ్య, ఎ.శరత్‌బాబు, పైడిశెట్టి, టి.రమేష్, బిబి.అంబర్కర్, కె.రమేష్, పి.నాగేశ్వర్‌రావు, జి.రాధాకృష్ణమాచార్య, వైఎన్ రెడ్డి, కెఎన్‌ఎస్ విశ్వనాథం, జెవి రమణమూర్తి, దత్తా, కె.శ్రీమన్నారాయణ, ఎ.రాంచంద్రారెడ్డి, ఎం.సాయిశంకర్, ఆర్‌ఎల్‌ఎన్.సాయిప్రసాద్, బివి.అప్పారావు, అజిత్‌కుమార్‌రెడ్డి, పి.నాగేశ్వర్‌రావు, వి.రాజేశ్వర్‌రావు, డీఎస్. కేశవరావు, పద్మ, నిట్ పీడీ రవికుమార్, పీఆర్‌వో ప్రాన్సిస్ సుధాకర్ పాల్గొన్నారు.
 
ఐదుగురికి గోల్డ్‌మెడల్ ప్రదానం

నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్ల, నిట్ డైరక్టర్ ప్రొపెసర్ టి.శ్రీనివాసరావు చేతుల మీదుగా ఐదుగురు గోల్డ్‌మెడల్ అందుకున్నారు. ఇసీఇ టాపర్‌గా నిలిచిన  జి.విశాల్ లక్ష్మణ్‌రావుకు నిట్ ఇనిస్టిట్యూట్ గోల్డ్‌మెడల్‌ను, సివిల్ ఇంజనీరింగ్‌లో వి.శ్రీహిత, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఇఇఇ) లో సాయితేజ, కెమికల్ ఇంజనీరింగ్‌లో శ్రీదిత్యకు, కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్‌లో సిహెచ్.అశ్వినికి గోల్డ్‌మెడల్‌ను అందజేశారు.
 

మరిన్ని వార్తలు