- పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్
- కడపలో అంజాద్.. బద్వేలులో జయరాములు మాటామంతి
- మూడు రోజుల పర్యటన విజయవంతం
సాక్షి, కడప : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందలు, వేలల్లో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చినా ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేయకుండా ఆప్యాయంగా పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 7వ తేదీన పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తొలి రోజు నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. 8వ తేదీ పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించిన వైఎస్ జగన్‌రెడ్డి అనంతరం ప్రజలతో కలిసిపోయి సమస్యలు తెలుసుకున్నారు.
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్‌రెడ్డిని శనివారం ఉదయం ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అంశాలతోపాటు పలు సమస్యలపై వారు మాట్లాడుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను ఈ సందర్భంగా కలుసుకున్నారు. పులివెందుల నుంచి నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను మార్గమధ్యలో కడప వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా కలుసుకుని చర్చించారు. బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు తదితరులు జగన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
నూతన జంటకు ఆశీర్వాదం :
పులివెందులలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం అంకాలమ్మ గూడూరుకు చెందిన కక్కిరెడ్డి పురుషోత్తమరెడ్డి కుమార్తె నవ్యత, రాఘవేంద్రారెడ్డి వివాహానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పర్యటన జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో దాదాపు మూడు రోజులపాటు ఉండి కార్యకర్తలు, నాయకుల సమస్యలకు పరిష్కారం చూపడంతో వారిలో నూతనోత్సాహం నెలకొంది. అండగా ఉంటానని.. ధైర్యంగా ముందుకు సాగాలని.. పార్టీపరంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని వైఎస్ జగన్ హితబోధ చేశారు.
అధైర్య పడవద్దు.. అండగా ఉంటా..
బద్వేలు : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని బద్వేలు మీదుగా శనివారం నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఎమ్మెల్యే జయరాములుతో పాటు పలువురు నాయకులు మండలంలోని బయనపల్లె సమీపంలో కలిశారు. ముఖ్యనేతలను ఎమ్మెల్యే జయరాములు జగన్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ సింగసాని గురుమోహన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డి పలువురు సర్పంచులు జయసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, విజయభాస్కరరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
అందరితో ఆప్యాయంగా...
Published Sun, Aug 10 2014 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement