హైదరాబాద్ లో తోషిబా మరో కొత్త ప్లాంట్

7 Apr, 2016 16:30 IST|Sakshi

హైదరాబాద్ :  జపాన్‌కు చెందిన తోషిబా కార్పోరేషన్  భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లోతన నిబద్ధతను, అంతర్జాతీయ మార్కెట్లలో దాని సరఫరా సామర్థ్యాన్ని విస్తరించేందుకు  కృషి చేస్తోంది. ఈ  నేపధ్యంలో  హైదరాబాద్ లో రైల్వేల కోసం   ఎలక్ట్రికల్ పరికరాలను  తయారు చేసే  యొక్క ఒక కొత్త   ప్లాంట్ ను  ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది . తమ వ్యాపార విస్తరణలో బాగంగా  ఒక కొత్త, ప్రత్యేక రైల్వే వ్యవస్థ డివిజన్ ను  తోషిబా ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (భారతదేశం)  టిటీడీఐ   సారధ్యంలో స్థాపిస్తున్నట్టు   సంస్థ సీఎండీ కత్సుతోషీ తోడా తెలిపారు. రానున్న సంవత్సరాలలో విద్యుత్తు పంపిణీ విపణిలో 20శాతం వాటాను దక్కించుకోవడమే ధ్వేయంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 2017 లో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుందని,  డిమాండ్ ను బట్టి దీన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.    2020 నాటికి 100 మంది ఉద్యోగులను చేర్చకునే అవకాశం ఉందని  తోషిబా అంచనా వేసింది.   స్థానిక మార్కెట్ అవసరాలనుగుణంగా  తమ  నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు,  పోటీతత్వాన్ని పెంచేందుకు కృషి చేస్తామని  తెలిపింది.  మధ్య తూర్పు,  ఆఫ్రికా మార్కెట్లలో డిమాండ్ అనుగుణంగా ఉత్పాదక కేంద్రంగా  రూపుదిద్దుకోనున్నట్టు తెలిపారు.

భారతదేశంలో ముఖ్యంగా విద్యుత్తు, రవాణా అవస్థాపనలో బలమైన, దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామన్నారు.  ఒక అద్భుతమైన, పెరుగుతున్న మార్కెట్ కు  కనుగుణంగా  దేశం అంతటా అంకితభావంతో సేవలు అందించనున్నట్టు తోడా తెలిపారు.  తద్వారా ఉపాధి కల్పనతో సహా దేశ  పారిశ్రామిక అభివృద్ధికి  మేక్ ఇన్ ఇండియా లో దోహదం చేస్తున్నామన్నారు.  అత్యంత మన్నికైన సాంకేతికతలు,  సేవలు అందించడం ద్వారా తమ  రైల్వే సిస్టమ్స్ వ్యాపార రంగంలో   ప్రపంచ వ్యాప్తవిస్తరణకు కృషి చేయాలనేది తమ లక్ష్యమన్నారు.

 

మరిన్ని వార్తలు