చాక్లెట్ సూపర్‌స్టార్ | Sakshi
Sakshi News home page

చాక్లెట్ సూపర్‌స్టార్

Published Thu, Apr 7 2016 4:25 PM

చాక్లెట్ సూపర్‌స్టార్

చెన్నై: అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపణ అయ్యింది. అభిమానులు వారు అభిమానించే వారిని తమకు ఇష్టం వచ్చిన  రీతిలో చూసి ఆనందిస్తుంటారు. కొందరు గుడి కట్టి పూజిస్తే, మరికొందరు శిలావిగ్రహాలు నెలకొల్పి ఆరాధిస్తుంటారు. ఇంకొందరు మైనపుబొమ్మగా ప్రతిష్టించి సంతోషిస్తుంటారు. దీన్ని వీరాభిమానం, పిచ్చి ప్రేమ, లేక వెర్రి అన్నా అనుకోండి. ఈ విషయంలో ఎంత ఖర్చు అయినా వెనుకాడనివ్వదు అభిమానం. ఇక నటుల విషయానికొస్తే వారి అభిమానులు భారీ కటౌట్లు, వాటికి పూలార్చనలు, పాలాభిషేకాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఆ మధ్య బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు, ఇళయదళపతి విజయ్‌కు మైనపు ప్రతిమలుగా మలచి వేడుక జరుపుకున్నారు.

తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చాక్లెట్ మ్యాన్‌గా మార్చేసి ఆనందిస్తున్నారు. ఎస్ చెన్నైలో ఒక బేకరీ షాప్ నిర్వాహకుడు 600 బరువైన చాక్లెట్‌తో కబాలి చిత్రంలోని రజనీకాంత్ ప్రతిమను తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు.ఆ చాక్లెట్ రజనీకాంత్‌ను చూడడానికి ప్రజలు వరుస కడుతున్నారు.

Advertisement
Advertisement