అప్పట్లోనే ఖజానా బిల్డింగులు

16 Mar, 2018 08:01 IST|Sakshi
గోల్కొండలోని ఖజానా భవనం, ఖిల్వత్‌ ఖజానా స్థలం ఇదే...

సాక్షి, సిటీబ్యూరో: కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనా కాలంలోనే ట్రెజరీ వ్యవస్థ ఉంది. అప్పుడే నగరంలో ఖజానా బిల్డింగుల నిర్మాణం జరిగింది. ఇబ్రహీం కుతుబ్‌షా (1550–80) గోల్కొండ కోటలో ఖజానా బిల్డింగ్‌ నిర్మించగా... రెండో నిజాం నిజామ్‌అలీ 1876లో ఖిల్వత్‌ ప్యాలెస్‌ ఎదుట ఖజానా భవనం నిర్మించాడు. వీటిలో ప్రభుత్వ డబ్బు, విలువైన పత్రాలు, ధాన్యం, ఆభరణాలు తదితర ఉండేవి. ఔరంగజేబు దాడి వరకు గోల్కొండలోని ఖజానా బిల్డింగ్‌ ప్రభుత్వ ఖజానాగానే కొనసాగింది. అనంతరం కుతుబ్‌షాహీల సైన్యం ప్రధాన కార్యాలయంగా మారింది. తర్వాత ఆసఫ్‌జాహీల కాలంలోనూ ఇది అలాగే కొనసాగింది. ఇప్పటికీ ఇది చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఇక ఖిల్వత్‌ ఖజానా భవనం కూల్చివేయగా, స్థలం ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ అధీనంలో ఉంది.

మరిన్ని వార్తలు