‘బీటీ’ బ్యాచ్‌తో గులాబీ నేతల బెంబేలు

5 Jul, 2015 14:45 IST|Sakshi
‘బీటీ’ బ్యాచ్‌తో గులాబీ నేతల బెంబేలు

గులాబీ దళంలో చేరిపోతున్న నాయకుల సంఖ్యను చూసి ఆ పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న నాయకులు బెంబేలు పడిపోతున్నారు. బంగారు తెలంగాణ కోసం వస్తున్నామంటున్న వీరందరికీ ‘బీటీ’ బ్యాచ్ అని పేరు ఇప్పటికే స్థిరపడిపోయింది. వీరి రాకవల్ల తమ అవకాశాలకు ఎక్కడ గండిపడుతుందో అన్న ఆందోళన వారిది. కాంగ్రెస్ నుంచి క్యూ కడుతున్న సీనియర్లలో కొందరికి రెడ్ సిగ్నల్ పడినా, మరికొందరికి మాత్రం రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. ‘సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేశాం. లెక్కకు మించి డబ్బులు ఖర్చు చేశాం.
 
 ఇంకా, అందివచ్చిన పదవే లేదు. ఇపుడు కొత్తగా పార్టీ గడప తొక్కుతున్న వారికి మాత్రం పిలిచి పీటేస్తున్నారు. మరి మా గతేం కాను!’ అంటూ వీరంతా మథనపడుతున్నారు. పదవుల గోల ఒక్కటే కాదు, మరీ సీనియర్లను ఆహ్వానిస్తే, తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని ఇదై పోతున్న వారిలో ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇక ఎవరూ వద్దంటూ కొందరు పోరు పెడుతున్నా, వీరి మాటను చెవికి ఎక్కించుకునే వారే లేకుండా పోయారు. గులాబీ గూటిలో ఇపుడు అంతా పాత-కొత్తల గోల జోరుగా సాగుతోంది.

మరిన్ని వార్తలు