‘జనరల్‌ విద్యార్థులకూ గురుకులాలు’

31 Jul, 2018 15:56 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి

సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్రంలో విద్యావవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మన విద్యార్థులు ఎందులోనూ  తీసిపోరని పేర్కొన్నారు. జిల్లాలోని నెక్కొండ గురుకుల పాఠశాలలో ఆయన మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మంచి మెనూ తయారు చేసిందని అన్నారు.

ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లల ఆరోగ్యం కోసం.. ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయల చొప్పున ఖర్చు చేసి 6 లక్షల మందికి హెల్త్‌, హైజనిక్‌ కిట్‌లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్‌ కులాల బాలికల విద్యావృద్థికి తెలంగాణలో 53 గురుకులాలను ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు