వారానికి ఇద్దరు!

17 Jun, 2017 02:39 IST|Sakshi
వారానికి ఇద్దరు!

పోలీసు కాల్పుల్లో మరణిస్తున్న సామాన్యుల సంఖ్య ఇది
4,747 - 2009–2015 మధ్య దేశంలో మొత్తం కాల్పుల ఘటనలు
796 -  2009 నుంచి 2015 మధ్య కాల్పుల్లో మృతిచెందినవారు


పండించిన పంటకు మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులపై జూన్‌ 6న మధ్యప్రదేశ్‌ పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. గత ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారట. 2009–2015 మధ్య నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం.. 2009 నుంచి 2015 మధ్య పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 796. 2009–2015 మధ్య దేశంలో 4,747 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, దేశంలో 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

 – సాక్షి తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు