రైతు వ్యతిరేక ప్రభుత్వాలు

9 Jun, 2017 02:25 IST|Sakshi
రైతు వ్యతిరేక ప్రభుత్వాలు

మోదీ, కేసీఆర్‌ల పాలనపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం
హుజూర్‌నగర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లా డారు.  వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నా రు. పంటల కొనుగోళ్లు, గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని తాము శాసనసభలో కోరినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.

ఎకరానికి రూ.4 వేలు  పథకాన్ని ఈ ఖరీఫ్‌ నుంచే అమలు చేసి సీఎం కేసీఆర్‌ తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలన్నారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,  రూ.2 లక్షలను రుణ మాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీల అమ లులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎల్పీ నేత జానారెడ్డి విమ ర్శించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను మార్చి నేడు టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ కొనసాగిస్తోందని విమర్శిం చారు. సీఎం అభ్యర్థి ఎవరనే విషయం «అధిష్టానం చూసుకుంటుందన్నారు.

మరిన్ని వార్తలు