కార్మికులూ.. త్రిఫ్ట్‌ పథకంలో చేరండి 

26 Mar, 2018 10:36 IST|Sakshi
అవగాహన కల్పిస్తున్న సామాజిక కార్యకర్త మార్కండేయులునేత

సిరిసిల్ల: ప్రతీనేత కార్మికుడు త్రిఫ్ట్‌ పథకంలో చేరాలని, కుటుంబాలకు పొదుపు అలవాటు చేయించాలని సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు కోరారు. పట్టణంలోని మరమగ్గాల సాంచాల మధ్య కార్మికులకు త్రిప్ట్‌ పథకంపై ఆదివారం అవగాహన కల్పించారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి త్రిప్ట్‌ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
 

కార్మికులు తమ నెలవారి సంపాదనలో 8శాతం బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని, మరో 8 శాతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇలా.. నెలకు రూ.800 జమ చేస్తే.. మరో రూ.800 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మూడేళ్ల తర్వాత రూ.75 వేల వరకు కార్మికుడికి అందుతుందని వివరించారు.  

మరిన్ని వార్తలు