పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు

27 Feb, 2015 21:43 IST|Sakshi
పొలానికి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు

వేములవాడ(కరీంనగర్): ఎక్కడైనా రైతులు పొలానికి నీళ్లు ఎలా పెడతారు ? బోరు సహాయంతోనో లేక బావిలోని నీటినో ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుత కరెంట్ కోతలతో విసుగు చెందిన ఒక రైతు ఏకంగా వాటర్ ట్యాంకర్‌తో పొలానికి నీటిని అందిస్తున్నాడు. ఈ సంఘటనను చూస్తేనే తెలుస్తుంది తెలంగాణలో కరెంట్ కష్టాలు ఎలా ఉన్నాయో. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం క్షేత్రాజపల్లి గ్రామంలో శుక్రవారం దర్శనమిచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన తాహెర్‌పాషా వేసవిలో పొలం సాగుచేశాడు.

అయితే, కరెంట్ కష్టాలతో పొలానికి నీరు సరిగా అందడంలేదు. ఈ స్థితిలో పాలుపోని రైతు ఎలాగైనా పొలానికి నీటిని అందించాలనుకున్నాడు. దీంతో ఒక వాటర్ ట్యాంకర్ సహాయంతో తన పొలానికి నీటిని అందిస్తున్నాడు. కరెంట్ కష్టాల నుంచి ఉపసమనం కోసం పొలానికి ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నానని వాపోయాడు.

మరిన్ని వార్తలు