ప్రముఖ రచయిత్రి ప్రమీలాదేవి మృతి

2 Nov, 2018 09:16 IST|Sakshi
రచయిత్రి డాక్టర్‌ మంగళగిరి ప్రమీలాదేవి(75)

గౌతంనగర్‌: ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ మంగళగిరి ప్రమీలాదేవి(75) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యమున్న ప్రమీలాదేవి సుమారు 40 పుస్తకాలు రచించారు. ‘పద సాహిత్య పరిషత్‌’ అనే సంస్థను స్థాపించి సాహిత్య సేవలందించారు. అన్నమాచార్య కీర్తనలపై పీహెచ్‌డీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులైలో మధ్యప్రదేశ్‌లో జరిగిన అఖిల భారతీయ రాష్ట్ర భాషా సమ్మేళనంలో సరస్వతీ సన్మాన్‌ అవార్డు అందుకున్నారు. సర్దార్‌పటేల్‌నగర్‌లోని శ్మశానవాటికలో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రముఖ కవయిత్రులు ముక్తావి భారతి, ఆకెళ్ల విజయలక్ష్మి, తమిరస జానకి, గోల్లమూరి పద్మావతి తదితరులు హాజరై నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు