21 మంది మహిళా పిక్పాకెటర్లకు జరిమానా

27 Jun, 2016 13:46 IST|Sakshi
21 మంది మహిళా పిక్పాకెటర్లకు జరిమానా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు అమ్మాయిలు పిక్పాకెటర్ల అవతారమెత్తారు. మోడ్రన్ దుస్తులు వేసుకుని కాలేజీ అమ్మాయిల్లా, ఉద్యోగుల్లా కనిపిస్తారు. మెట్రోలో హడావిడిగా తిరుగుతుంటారు. వీరిపట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే. జేబులు, హ్యాండ్ బ్యాగుల్లో డబ్బులు, సెల్ఫోన్ ఇతర విలువైన వస్తువులు మాయం అయిపోతాయి. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా నిఘా వేసి 21 మంది మహిళా పిక్పాకెటర్లను అదుపులోకి తీసుకుని జరిమానా వేశారు.   

ఆదివారం మఫ్టీలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. రాజీవ్ చౌక్, బరఖంబ రోడ్డు, కశ్మీర్ గేట్ వంటి రద్దీ రైల్వే స్టేషన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్న మహిళలను అదుపులోకి తీసుకుని మూడువేల రూపాయలకుపైగా జరిమానా వేశారు. ఢిల్లీలోని ఇతర మెట్రో స్టేషన్లలోనూ నిఘా ఉంచుతామని అధికారులు చెప్పారు. ఢిల్లీ మెట్రోలో రోజూ దాదాపు 26 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

మరిన్ని వార్తలు